బన్నీకి అక్కడ నో పర్మీషన్…

బన్నీకి అక్కడ నో పర్మీషన్...

0
33

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం అలా వైకుంఠపురంలో ఈచిత్రం సంక్రాంతి పండుగకు కానుకగా విడుదలై బాక్సాఫీస్ బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే… ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు…..

ఈ సినిమా హిట్ అయిన తర్వాత అల్లు అర్జున్ ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా తన తదుపరి చిత్రం దర్శకుడు సుకుమార్ తో తీస్తున్నాడు… ఈ సినిమాకు సంబంధించిన పనులు అన్ని శర వేగంగాజరుగుతున్నాయి… ఇప్పటికే సుకుమార్ కేరళ అడవుల్లోటెస్ట్ షూట్ చేసుకుని తిరిగి వచ్చారు..

మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు… ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో సాగే స్టోరీ ఇది… దాదాపు చిత్రీకరణ మొత్తం ఫారెస్ట్ లోనే ఉంటుంది…అయితే శేషాచలం అడవుల్లో అనుమతి లేని కారణంగా బ్యాంకాక్ అడవుల్లో సన్నివేశ చిత్రీకరణ ప్లాన్ చేస్తున్నారట… అయితే ప్రస్తుతం కరోనా వైరస్ భయం ఉందికాబట్టి కొన్నినెలలు ఆగి పయణం కారున్నారని టాక్…