చంద్రబాబుపై విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణలు

చంద్రబాబుపై విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణలు

0
73

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు… అహ్మద్ పటేల్ కు పంపిన 400 కోట్లే కాదని బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలన్నిటికి నిధులు సమకూర్చారని ఆరోపించారు విజయసాయిరెడ్డి…

అంతేకాదు తెలంగాణ ఎన్నికల్లో కూడా 400 కోట్లు ఖర్చు పెట్టారని మండిపడ్డారు.. ఇప్పట్లో దీనిపై జాతీయ మీడియాలో పెద్ద చర్చే జరిగిందని గుర్తు చేశారు విజయసాయిరెడ్డి 13 జిల్లాల చిన్న రాష్ట్రం సీఎం దేశం మొత్తానికి ఎలక్షన్ ఫండింగ్ శారని గతంలో అందరు చెప్పుకున్నారని విజయసాయిరెడ్డి అన్నారు..

కమీషన్ల కోసం ఎక్కువ ధరకు విద్యుత్ కోనుగోలు ఒప్పందాలు చేసుకొని ఏపీ ట్రాన్స్ కోకు 70 వేల కోట్ల రూపాయలు అప్పులు మిగిల్చి చంద్రబాబు నాయుడు వెళ్లారని ఆరోపించారు… ఈ పీపీఏల దళారి ఎవరంటే కిరసనాయులు అక్రమ సంపాదన ఆగిపోయిందనే సీఏం జగన్ మోహన్ రెడ్డిని పీపీఏల రద్దుపై ప్రధాని మోదీ నిలదీశారని బోగస్ వార్త రాశాడని ఆరోపించాడు విజయసాయిరెడ్డి ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు…