ఏమైంది 40 ఇయర్స్ ఇండస్ట్రీకి

ఏమైంది 40 ఇయర్స్ ఇండస్ట్రీకి

0
83

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు… మద్యం వ్యసనం నుంచి బయటపడుతున్న వారిని రెచ్చగొట్టి మళ్లీ బానిసలను చేసేదాక చంద్రబాబు నాయుడు నిద్రపోయేట్లు లేరని విజయసాయిరెడ్డి ఆరోపించారు… ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు…

మద్యం ధరలు పెంచి మందు బాబుల పొట్ట కొడుతున్నారంటూ చంద్రబాబు నాయుడు రంకెలేస్తారని ఆరోపించారు. పీపీఏలను సమీక్షించి తక్కువ ధరకు కరెంట్ కొనుగోలు చేద్దామని ప్రభుత్వమనుకుంటే అడ్డుపడతారని ఆరోపించారు. ఇన్ సైడర్ ట్రేడింగు పైనా దర్యాప్తు జరపొద్దట. తన మాజీ పిఎస్ అడ్డంగా దొరికితే కక్ష సాధింపు అంటాడు. ఏమైంది 40 ఇయర్స్ ఇండస్ట్రీకి?

మద్యం వ్యసనం నుంచి బయటపడుతున్నవారిని రెచ్చగొట్టి మళ్లీ బానిసలను చేసిందాకా చంద్రబాబు నిద్రపోయేట్టు లేరని అన్నారు. ఇప్పుడిపుడే తాగుడుకు దూరమై భార్యాపిల్లలతో ప్రశాంతంగా గడుపుతున్నారు. 14 ఏళ్లు సిఎంగా చేసిన వ్యక్తి ఇంత బాధ్యత లేకుండా మాట్లాడటం దేశంలో ఎక్కడా కనిపించదని అన్నారు…