వైసీపీలో జంపింగ్ ఆ ఎమ్మెల్యే నుంచే స్టార్ట్ కానుందా…

వైసీపీలో జంపింగ్ ఆ ఎమ్మెల్యే నుంచే స్టార్ట్ కానుందా...

0
87

అధికార పార్టీ లోకి చేరిన ప్రతిపక్ష నాయకులకు మంచి గుర్తింపు ఇస్తుండటంతో అధికార పార్టీ ఎమ్మెల్యే లకు ఇది మింగుడు పడకుందట . ప్రత్యర్థులకు పెద్ద పీట వేయటాన్ని వారు సాహిచలేకపోతున్నారు. మరో నాలుగుగేళ్లు టైమ్ ఉంది కనుక 2024 సార్వత్రిక ఎన్నికల సమయానికి ఇతర పార్టీ లోకి వీరు జంప్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. అందులో రామచంద్రపురం వైసీపీ ఎమ్మెల్యే వేణుగోపాలకృష్ణ మొదటి వరుసలో వున్నారు.

ఈ నియోజకవర్గంలో మూడు వర్గాలు విడిపోయాయి… ఇటీవల పార్టీ లోకి చేరిన తోట త్రిమూర్తులు ఒక వర్గం, ప్రస్తుత డిప్యూటీ సి ఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ ఒక వర్గం, వేణుగోపాలకృష్ణ మరో వర్గంగా విడిపోయాయి.. ఇందులో సుభాష్ చంద్రబోస్ వర్గం కొంత సర్దుకుపోయినట్లు కనిపిస్తున్నా ఎమ్మెల్యే వర్గం ఎక్కడ తగ్గడం లేదు. ఇటీవల వై వీ సుబ్బారెడ్డి సమక్షంలోనే తోట త్రిమూర్తులు పై ఎమ్మెల్యే వర్గం దాడికి ప్రయత్నంచింది.

ఇక వచ్చే ఎన్నికల పరిస్థితులను ఒక్క సారి బేరీజు వేసుకుంటే వేణుగోపాలకృష్ణ టికెట్ కోసం తీవ్రంగా శ్రమిచాల్సి ఉంటుంది. తోట త్రిమూర్తులు గట్టి పోటీ ఇచ్చే అవకాశముంది. మరోవైపు పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా ప్రయత్నాలు చేసే అవకాశం కూడా లేకపోలేదు. మూడు వర్గాలు ఒకరికొకరు సహకరించుకునే పరిస్థితి లేదన్నది వాస్తవం. ఈ పరిస్థితుల్లో పార్టీని ఎన్నికలకూు ముందు వీడే నేతల్లో వేణుగోపాలకృష్ణ ప్రథముడిగా కనిపిస్తునారు.