Home రాజకీయం పవన్ కు మరోసారి ఝలక్ ఇచ్చిన రాపాక… ఈ సారి ఏకంగా…

పవన్ కు మరోసారి ఝలక్ ఇచ్చిన రాపాక… ఈ సారి ఏకంగా…

పవన్ కు మరోసారి ఝలక్ ఇచ్చిన రాపాక... ఈ సారి ఏకంగా...

0
207

జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తుపెట్టుకుని పోటీ చేయగా కేవలం రాజోలులో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే… జనసేన తరపున ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక వరప్రసాద రావు పార్టీ నిర్ణయాలను పక్కన పెట్టి వైసీపీకి సపోర్ట్ గా నిలుస్తున్నారు…

అసెంబ్లీ సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలను ఆయన అభినందించారు… ఆ తర్వాత తన నియోజకవర్గంలో జగన్ ఫోటోకు పాలాభిషేకం చేయడంతో ఆయన వైసీపీలో చేరుతారని అందరు అనుకున్నారు కానీ ఆయన చేరలేదు తాజాగా మరో సారి క్లారిటీ ఇచ్చారు…

తాను జనసేన పార్టీలో ఉన్నానని అన్నారు… జనసేన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నానని అన్నారు… తాను పార్టీకి దూరంగా లేనని అలా అని దగ్గరగా కూడా లేనని అన్నారు… పార్టీ నుంచి పిలుపు రాలేదని అందుకే తాను పవన్ తో భేటీ కాలేదని అన్నారు