అమెజాన్ ఫుడ్ డెలివరీ యాప్ సరికొత్త బిజినెస్

అమెజాన్ ఫుడ్ డెలివరీ యాప్ సరికొత్త బిజినెస్

0
76
Amazon Layoffs

ఇప్పుడు అంతా ఆన్ లైన్ బిజినెస్ పెరిగింది …ఈ కామర్స్ రంగం బాగా కూడా బాగా పెరిగింది అని చెప్పాలి, ఇక ఫుడ్ డెలివరీ రంగంలోకి అనేక కంపెనీలు వచ్చాయి ఇప్పటికే స్వీగ్గి జుమాటో మన దేశంలో అతి పెద్ద బిజినెస్ చేస్తున్నాయి, తాజాగా వీటికి పోటీగా ఈ కామర్స్ రంగంలో అతిపెద్ద కంపెనీ అమెజాన్ భారత్ లో అడుగుపెట్టనుందట.

ఇప్పటికే అమెజాన్ ప్రైమ్, అమెజాన్ నవ్ సర్వీసుల ద్వారా ఇంటింటికీ కిరాణా సరుకులు, కూరగాయలు, పౌల్ట్రీ ఉత్పత్తులు సరఫరా చేస్తున్న అమెజాన్.. ఇక ఫుడ్ డెలివరీ బిజినెస్ పైనా దృష్టి పెట్టినట్టు మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి.ఇక ముందు బెంగళూరులో కొన్ని టెస్టింగ్ పాయింట్స్ ఏర్పాటు చేసి కంపెనీ టెక్నికల్ టీం ఆర్డర్స్ ద్వారా టెస్ట్ చేస్తున్నారట, పలు హోటల్స్ తో టెస్ట్ చేయిస్తున్నారట.

ఇక ఇది సక్సెస్ అయితే వచ్చే నెల లేదా ఏప్రిల్ లో బిగ్ అనౌన్స్ మెంట్ వస్తుంది అని తెలుస్తోంది..ఇక ఇప్పటికే ఈ వ్యాపారంలో తీవ్ర పోటి ఉంది, అయితే వచ్చే రోజుల్లో అమెజాన్ కూడా పలు ఆఫర్లు ఇస్తుంది అని అంటున్నారు. ఇక అమెజాన్ ఎంట్రీతో ఈ రెండు కంపెనీలు ఎలా ముందుకు సాగుతాయో చూడాలి.