ఫ్లాష్ న్యూస్ చిరంజీవికి రాజధాని సెగ? ఆయన ఇంటి దగ్గర రైతులు ఏం చేస్తున్నారంటే

ఫ్లాష్ న్యూస్ చిరంజీవికి రాజధాని సెగ? ఆయన ఇంటి దగ్గర రైతులు ఏం చేస్తున్నారంటే

0
73

ఏపీలో రాజధాని విషయంలో అన్నీ రాజకీయ పార్టీలు ఎవరి స్టాండ్ వారు తీసుకున్నారు… వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు… మూడు రాజధానులు కావాలి అని వారు ముందుకు సాగుతున్నారు… మరో పక్క టీడీపీ కేవలం అమరావతి రాజధానిగా ఉండాలి అని కోరుతోంది, ఇక పవన్ కల్యాణ్ కూడా అమరావతి రాజధానిగా ఉండాలి అని కోరుతున్నారు , అయితే కేంద్రం నుంచి సపోర్ట్ తో జగన్ విశాఖని రాజధానిగా చేస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ రాజధాని అంశం పై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ ఏపీ రాజధాని విషయంలో మూడు రాజధానుల నిర్ణయం మంచిది అని.. దానికి సపోర్ట్ తెలిపారు. జగన్ కు మద్దతు ఇచ్చారు, అయితే ఇది అమరావతి రైతులకి అక్కడ ప్రజలకు ఆగ్రహం కలిగించింది.

ఆంధ్రులకు ఒకటే రాజధాని పేరుతో ఉద్యమిస్తున్న అమరావతి పరిరక్షణ యువజన జేఏసీ సంచలన ప్రకటన చేసింది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంటిముందు దీక్షకు దిగుతామని ప్రకటించింది. హైదరాబాద్లోని చిరంజీవి ఇంటి ముందు ఈ నెల 29న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేస్తామని ప్రకటించారు, అమరావతి రాజధానిగా కోరుకుంటున్న వారు ఈ దీక్షకు మద్దతు తెలపాలి అని కోరారు. ఇప్పుడు వారి ప్రకటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోం