ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జగన్ కు వచ్చేది ఎన్ని సీట్లో తెలుసా…

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జగన్ కు వచ్చేది ఎన్ని సీట్లో తెలుసా...

0
81

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వచ్చిన 23 సీట్లు కూడా రావని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు..

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… సీఎం జగన్ మోహన్ రెడ్డి దురుద్దేశంతోనే మూడు రాజధానుల ప్రకటన చేశారని ఆయన ఆరోపించారు.. తాము రాజధాని రైతులకు కట్టుబడి ఉన్నామని తెలిపారు కన్నా.. రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి పాలన సాగుతోందో లేక పోలీసుల పాలన సాగుతోందో అర్థం కానీ పరిస్థితి అని అన్నారు…

రాజధాని పేరుతో వైసీపీ నాయకులు విశాఖలో ఎక్కడ తమ భూములు కబ్జాచేస్తారో అనే భయంతో ఉన్నారని ఆరోపించారు… అంతేకాదు త్వరలో తమ భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని అన్నారు కన్నా…