తన స్నేహితుడు ఫొలాల్లోకి తీసుకువెళ్లి బలవంతంగా లైంగిక దాడి చేశాడని బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న ఓ యువతి స్పందనలో ఫిర్యాదు చేసింది… తాను గతంలో గుంటూరులో కోచింగ్ తీసుకున్న సమయంలో జేకేసీ కళాశాల ప్రాంతానికి చెందిన ఒక యువకుడు పరిచయం అయ్యాడని తెలిపింది…
కొన్నిరోజులకు ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడని తెలిపింది… ఆతర్వాత ఆమెకు వేరే చోట అగ్రికల్చర్ బీఎస్సీ సీటు వచ్చింది… ఇటీవలే కళాశాలలో సెలవులు ఇవ్వడంతో ఆయువతి తన స్వగ్రామానికి బయల్దేరింది అదే సమయంలో ఆ యువకుడు ఫోన్ చేసి గుంటూరులో దిగాలని చెప్పాడు..
లేదంటే యాసిడ్ తో దాడి చేస్తానని బెధించాడు దీంతో యువతి గుంటూరులో దిగింది… అక్కడే ఉన్న ఆ యువకుడు తన వెంటరావాలని బలవంతం చేశాడు… రానని చెప్పడంతో చేయి చేసుకుని బలవంతంగా బైక్ మీద ఎక్కించుకుని ఫొలాల్లో లైంగికదాడి చేశాడు… ఆ తర్వాత తనను లాఫరం దగ్గర వదిలి వెళ్లాడని తన స్నేహితుల ద్వారా ఇంటికి వచ్చానని తెలిపింది…