కడప జిల్లాలో టీడీపీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి, అసలు ఇలాంటి రోజు వస్తుంది అని చంద్రబాబు కలలో కూడా ఊహించి ఉండరు..టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు… గడిచిన రెండు రోజులుగా ఆయన రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకుంటారు అని వార్తలు వచ్చాయి.
అంతేకాదు ఆయన వైసీపీలో చేరుతారు అని వార్తలు వినిపించాయి.. ఇప్పుడు ఇదే నిజమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన బుధవారం పార్టీ కండువా కప్పుకున్నారు. రామసుబ్బారెడ్డితో పాటు తుంగభద్ర హెచ్‌ఎల్‌సీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ గిరి వైఎస్సార్ సీపీలో చేరారు.
టీడీపీ పెట్టిన సమయం నుంచి అందులోనే కొనసాగాం కాని జగన్ గారి కార్యక్రమాలు పథకాలు బాగున్నాయి అందుకే వైసీపీలో చేరుతున్నాం.. జిల్లా కూడా అభివృద్దిలో ముందుకు సాగుతుంది అన్నారు, అంతేకాదు కార్యకర్తలు ఇదే కోరుకున్నారు అని తెలిపారు. నేను స్వచ్ఛందంగా వైఎస్సార్ సీపీలో చేరాను. మమ్మల్ని ఎవరూ బెదిరించడం లేదు అని తెలిపారు, ఇక ఆదినారాయణ రెడ్డి బీజేపీలో ఉన్నా ఆయన సైలెంట్ అయిన విషయం తెలిసిందే.