ఈ జిల్లాలో టీడీపీ ఆఫీస్ కు తాళం….

ఈ జిల్లాలో టీడీపీ ఆఫీస్ కు తాళం....

0
77

త్వరలో కడప జిల్లాలోని టీడీపీ ఆఫీస్ కు తాళం వేయడం ఖాయమా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు… 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోవడంతో టీడీపీ సీనియర్ నాయకులు సీఎం రమేష్ అలాగే ఆదినారాయణ రెడ్డి వంటి వారు బీజేపీలోకి జంప్ చేశారు…

ఇక మొన్న పార్టీకి పెద్దదిక్కు అయిన సతీష్ రెడ్డి కూడా టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే… తాజాగా మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి కూడా టీడీపీకి గుడ్ బై చెప్పి ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు….

జిల్లాలో టీడీపీకి ఆయివు పట్టులా ఉన్న కీలక నేతలందరు ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు.. ఈ జంపింగ్ లు ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో జిల్లాలో ఉన్న పార్టీ ఆఫీస్ కు తాళం వేయడం ఖాయం అని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు… మరి చంద్రబాబు నాయుడు ఎలాంటి ప్లాన్లు వెస్తారో చూడాలి…