చాలా మంది కొత్త ప్రాంతాలకు వెళ్లిన సమయంలో లాడ్జీలకు వెళతారు.. ఈ సమయంలో కుటుంబంతో వెళితే కచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి.. ఎందుకు అంటే ఇప్పుడు మిమ్మల్ని సీక్రెట్ గా రూమ్స్ లో కెమెరాలు బంధిస్తున్నాయి . అక్కడ నుంచి మీ వీడియోలు వివిధ సామాజిక మాధ్యమాల్లో పోర్న్ సైట్లలో కనిపిస్తున్నాయి.. అందుకే జాగ్రత్తగా ఉండాలి.
తాజాగా ఇలాంటిదే జరిగింది ..ఓ కుటుంబం తమిళనాడులోని ప్రముఖ దేవాలయానికి సందర్శనకు వెళ్లింది.. ఓ పెద్ద హోటల్ లో 5 వేల రూపాయలకు రూమ్ తీసుకుంది, ఈ సమయంలో భార్య బెడ్ రూమ్ లో బట్టలు మార్చుకున్న వీడియో ఓ పది రోజుల తర్వాత పోర్న్ సైట్ లో బంధువుల కంట పడింది. దీంతో ఆ భర్తకి ఈ విషయం చెప్పారు.
దీంతో తాను గత పది రోజులుగా ఎక్కిడికి వెళ్లాము అనేది చూస్తే అక్కడ గుడికి వెళ్లినప్పుడు వీడియో అని వారికి తెలిసింది.. దీంతో వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ హోటల్ రూమ్ ని పరిశీలించగా ఎల్ ఈడీ బల్బు దగ్గర ఈ సీక్రెట్ కెమెరా పెట్టినట్లు తేలింది, వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.