ఇది అసలైన సంచలనం…. వైసీపీ, టీడీపీ జోడీ….

ఇది అసలైన సంచలనం.... వైసీపీ, టీడీపీ జోడీ....

0
85

ఏపీలో ఓ ఎన్నిక జరిగినా ప్రధాన పోటీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీల మధ్య సాగుతుంది… మరే పార్టీ పుట్టినా దానికి పెద్దగా ప్రయార్టీ ఉండదు… ఇది ఏపీలో ఎవరిని అడిగినా చెబుతారు… ఎప్పటినుంచో వైసీపీ, టీడీపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటునే ఉంది…

2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ స్థానిక సంస్థల్లో కూడా తమ సత్తాను చాటాలని చూస్తోంది ఈ తరుణంలో ఈ రెండు పార్టీలు విచిత్రంగా కలిసిపోయాయి… స్థానికి ఎన్నికల నేపథ్యంలో ఈ రెండు పార్టీలు దోస్తీ కట్టాయి.. అది కూడా గుంటూరు జిల్లాలో కావడం గమనార్హం… ముట్లూరు ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ కలిసి పోటీ చేస్తున్నాయి…

స్థానిక పరిస్థితుల ఆధారంగా చేసుకుని కలిసి పోయనున్నట్లు చెబుతున్నారు… అయితే మరో వర్గం మత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది… దీనిపై ఈ వర్గం వారు గల్లాకు ఫిర్యాదు చేశారు.. కొందరు టీడీపీ నాయకులు వైసీపీకి సహకరిస్తున్నారని తెలిపారు.. ఈ పరిస్థిత్లో మీరు రంగంలోకి దిగాలని గల్లాను కోరారట..