చిరంజీవి ఆచార్య‌పై మ‌రో అప్ డేట్

చిరంజీవి ఆచార్య‌పై మ‌రో అప్ డేట్

0
101

మెగాస్టార్ చిరంజీవి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న సినిమా ఆచార్య‌, ఈ సినిమా ప్ర‌క‌ట‌న కూడా ఇటీవ‌లే చిరంజీవి చేసేశారు, అయితే ఆయ‌న క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేదు, అందుకే ఆయ‌న సినిమా కోసం అంద‌రూ ఎదురుచూస్తున్నారు, ఇక కొర‌టాల సినిమాలు అంటే ఓ సోష‌ల్ మెసేజ్ ఉంటుంది.. ఇక చిరు కూడా ఇలాంటివి త‌న చిత్రాల ద్వారా ఇస్తారు.

అందుకే ఈ సినిమా కోసం అంద‌రూ చూస్తున్నారు, అయితే ఈ సినిమాని ముందు అనుకున్న విధంగా
ఆగస్టు 14వ తేదీన విడుద‌ల చేయాలి అని అనుకున్నారు, కాని ఈ సినిమా షూటింగ్ వాయిదా ప‌డింది, ఇప్ప‌టికే క‌రోనా వైర‌స్ వ‌ల్ల షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్నారు కొన్ని రోజులు.

శ‌ర‌వేగంగా జ‌రుగుతున్న షూటింగులో అనుకోకుండా ఏర్పడిన ఈ అంతరాయం వలన, షెడ్యూల్స్ ను మార్చుకోవలసి వస్తుంది. ఆర్టిస్టుల డేట్స్ ను బట్టి షెడ్యూల్స్ ను తిరిగి ప్లాన్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది… అందుకే ఈ సినిమా మ‌రింత లేట్ అవుతుంది అని టాలీవుడ్ టాక్ న‌డుస్తోంది.