మీరు చేప‌లు తింటారా అయితే ఇది త‌ప్ప‌క చూడాల్సిందే

మీరు చేప‌లు తింటారా అయితే ఇది త‌ప్ప‌క చూడాల్సిందే

0
45

క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత అస‌లు ఎవ‌రైనా స‌రే మాంసం తినాలి అంటేనే భ‌య‌ప‌డిపోతున్నారు, మాంసం దుకాణాలు చాలా వ‌ర‌కూ తీయ‌డం లేదు ఇక కిలో చికెన్ కొన్ని చోట్ల ఏకంగా 20 రూపాయ‌ల‌కు కూడా అమ్ముతున్నారు మ‌రికొంద‌రు ఏకంగా ఉచితంగా ఇస్తున్నారు, ఇక పౌల్ట్రీలు ఏకంగా ఉచితంగా కూడా కోళ్ల‌ని ఇస్తున్నాయి అలా ఉంది ప‌రిస్దితి

ఏకంగా ఇప్పుడు చికెన్ తిన‌క‌పోవ‌డంతో ల‌క్ష‌లాది మందికి నెల నుంచి ఉపాది క‌ర‌వు అయింది, అయితే చికెన్ మ‌ట‌న్ తింటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు అని చెబుతున్నా చాలా మంది ప‌ట్టించుకోవ‌డం లేదు, దూరంగానే ఉంటున్నారు

ఈ స‌మ‌యంలో చేప‌లు కూడా తిన‌డం మానేశారు, తాజాగా అలాంటి వారికి ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ శుభవార్త చెప్పింది. చేపలు, రొయ్యలు, ఇతర మత్స్య ఉత్పత్తులను ఆనందంగా తీసుకోవచ్చని, వీటివల్ల కరోనా వైరస్ వ్యాపించదని స్పష్టం చేసింది. అది సంగ‌తి.