తెలుగుదేశం పార్టీకి వరుస షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి, ఇప్పటికే చాలా మంది వైసీపీ గూటికి చేరుతున్నారు, ఈ సమయంలో వారానికి ఇద్దరు ముగ్గురిని పార్టీ నుంచి చేజార్చుకుంటోంది తెలుగుదేశం పార్టీ, తాజాగా సీమలోని నాయకులు కూడా వైసీపీలోకి క్యూ కట్టారు.. జమ్మలమడుగు రామసుబ్బారెడ్డి కూడా టీడీపీకి గుడ్ బై చెప్పారు, అయితే తాజాగా మరో కీలక నేత కర్నూలు నుంచి పార్టీ వీడనున్నారట.
కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి గుడ్బై చెప్పబోతున్నారు. త్వరలోనే ఆయన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చని తెలుస్తోంది. అయితే ఆయన సన్నిహితులు కొందరు ఇదే విషయం చర్చించుకుంటున్నారు, జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎక్కడా బలంగా లేదు ఈ సమయంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంటున్నారట.
ఇటీవలే కేఈ కుటుంబం సైతం దూరమైంది. మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్ మొన్నటి మొన్నే టీడీపీకి గుడ్బై చెప్పారు. మరి ఇలాంటి సమయంలో టీడీపీకి గుడ్ బై చెబుతున్నారు అనే వార్త మాత్రం పార్టీని మరింత నైరాశ్యంలో నెట్టేసింది. వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి చేతిలో 2019 ఎన్నికల్లో జనార్ధన్ బనగానపల్లి నుంచి ఓటమి పాలయ్యారు.