కరోనా చెకింగ్ లో తప్పించుకునేందుకు విమానం దిగగానే ఈ పని చేస్తున్నారట

కరోనా చెకింగ్ లో తప్పించుకునేందుకు విమానం దిగగానే ఈ పని చేస్తున్నారట

0
86

ఇప్పుడు ఎక్కడ విమాన ప్రయాణం చేస్తున్నా అది దిగగానే కచ్చితంగా కరోనా లక్షణాలు కనిపిస్తే వారిని టెస్ట్ చేస్తున్నారు, వారి శరీరంలో వేడి ఎంత ఉందో చూసి వారి టెంపరేచర్ కాలిక్యులేట్ చేస్తున్నారు ఈ సమయంలో 100 దాటితే వారిని పక్కన కేటగిరీ బీగా ఉంచుతున్నారు.. ఇక అంతకంటే ఎక్కువగా 101 లేదా 102 ఉంటే వారిని ఏ కేటగిరీగా చూస్తున్నారు.

అయితే తాజాగా చాలా మంది విమానం దిగగానే ధర్మల్ స్క్పీనింగ్ చేస్తున్న విషయం తెలుసుకున్నారు.. మనకు లక్షణాలు కనిపిస్తే ఇక ప్రత్యేక వార్డులకి తరలిస్తారు అని భయపడి విమానం దిగే గంటముందు టెంపరేచర్ పెరగకుండా పారాసిట్ మాల్ వేసుకుంటున్నారట. దీంతో వారి టెంపరేచర్ బాగా తగ్గుతోంది.

ఇలా చాలా మంది చేస్తున్నారు అని టెస్టుల్లో తేలింది.. దీంతో టెస్ట్ చేసే వారు మరింత జాగ్రత్త తీసుకుంటున్నారు. ఇలా గంట ముందు వేసుకోవడం వల్ల వారి టెంపరేచర్ తగ్గుతుంది మళ్లీ నాలుగు ఐదు గంటలకు పెరుగుతోంది.. దయచేసి ఇలా చేయకండి ఇలా చేయడం వల్ల వేరే వారికి కూడా వ్యాది సోకే ప్రమాదం ఉంది అని చెబుతున్నారు డాక్టర్లు.