టీడీపీలో మరో బిగ్ వికెట్ డౌన్…

టీడీపీలో మరో బిగ్ వికెట్ డౌన్...

0
88

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది.. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన కీలకనేతలు సైకిల్ దిగి వైసీపీ గూటికి చేరుకోగా మరికొందరు టీడీపీకి రాజీనామా చేసి పార్టీలో తమకు జరిగిన అన్యాయాన్ని మీడియా ద్వారా చెబుతున్నారు…

అలాగే తమ రాజకీయ భవిష్యత్ పై కార్యకర్తలతో చర్చించి చెబుతామని అంటున్నారు… ఇప్పటికే చాలామంది టీడీపీకి గుడ్ బై చెప్పారు… అందులో చాలామంది వైసీపీలో చేరిపోయారు… ఇదే క్రమంలో చిత్తూరు జిల్లా మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి కూడా టీడీపీకి రాజీనామా చేసింది….

తన రాజీనామా లేఖను పార్టీ కార్యాలయానికి పంపారు… ఎన్నో ఏళ్లుగా పార్టీకోసం కొనసాగుతున్నా తనకు ప్రస్తుతం సరైన గౌరవంలేదని రాజీనామా లేఖలో పేర్కొన్నారు… అందుకే తాను రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు…

తన రాజకీయ భవిష్యత్ తన కార్యకర్తలతో చర్చించిన ఆ తర్వాత తెలుపుతామని తెలిపింది లలిత కుమారి… కాగా రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు సార్లు ఎన్నికలు జరిగితే రెండు సార్లు ఓటమి చవి చూసింది లలిత కుమారి..