సంచలనం….పులివెందులలో జగన్ కు పోటీగా బరిలోకి లోకేశ్…. నిజమేనా….

సంచలనం....పులివెందులలో జగన్ కు పోటీగా బరిలోకి లోకేశ్.... నిజమేనా....

0
90

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల నుంచి ప్రాతినిధ్యం వహించారు… ఎప్పటి నుంచో పులివెందుల సెగ్మెంట్ వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట… ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కాని ఇక్కడ గెలుపు మాత్రం వైఎస్ ఫ్యామిలీదే…

ఈ ఫ్యామిలీపై వరుసగా టీడీపీ అభ్యర్థి సతీష్ రెడ్డి పోటీ చేసినా కూడా గెలవలేకపోయారు… తాజాగా ఆయన కూడా టీడీపీకి గుడ్ బై చెప్పారు… దీంతో పులివెందులలో టీడీపీ ఖాళీ అయింది… ఇప్పుడు ఆ ఖాళీని లోకేశ్ తో ఫుల్ చేయిస్తే ఎలా ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కొంతమంది సలహాలు ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయి..

జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నారు… సీఎంహోదాలో ఉన్న జగన్ కు వ్యతిరేకంగా పోటీ చేశారన్న పేరుతో పాటు 2024 ఎన్నికల్లో గెలిస్తే దేశ వ్యాప్తంగా లోకేశ్ పేరు మారు మ్రోగుతుందని తమ్ముళ్లు సలహాలు ఇస్తున్నారట… మరి చంద్రబాబు నాయుడు వారి సలహాల మేరకు లోకేశ్ ను పులివెందుల నుంచి పోటీ చేయించే సహసం చేస్తారా అనేది కాలమే నిర్ణయిస్తుంది.