జగన్ పై లోకేశ్ సంచలన ఆరోపణలు

జగన్ పై లోకేశ్ సంచలన ఆరోపణలు

0
75

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత నారాలోకేశ్… నెలకి హైకోర్టు లో ఆరు మొట్టికాయలు, సుప్రీంకోర్టులో మూడు తలంటులు ఉండకపోతే సీఎం జగన్ కు నిద్ర పట్టదని ఎద్దేవా చేశారు…

కరోనా దెబ్బకి పేదవాళ్ళు పనులు లేక ఇబ్బంది పడుతుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదు అర్ధం చేసుకోండి అంటున్న జగన్ మోహన్ రెడ్డి 1400 కోట్లు వృధా చేసి వైసీపీ రంగులు ఎందుకు వేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అన్ని చోట్లా నా రంగులే ఉండాలి అనుకోవడం సైకో మనస్తత్వంలో స్టేజ్ 2 అని ఆరోపించారు…

గ్రామాల్లో వైకాపా రంగుల కోసం 1400 కోట్లు ప్రజా ధనం వృధా చేసారని మండిపడ్డారు. ఇప్పుడు వాటిని చెరపడానికి మరో 1400 కోట్లు… 2800 కోట్లు ఎవడబ్బ సొమ్ము జగన్ మోహర్ రెడ్డి అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు…