మన దేశం కరోనాపై యుద్దం చేస్తోంది అనే చెప్పాలి.. ఇప్పటికే చాలా వరకూ కేసులు తగ్గుముఖం పట్టేలా చర్యలు తీసుకున్నారు.. మరో పక్క పేదలకు ఉద్యోగాలు లేనివారికి ఇలా అందరికి ఎంతో సాయం చేస్తున్నారు. ఈ సమయంలో ఉన్నవారు లేని వారికి సాయపడుతున్నారు.
అయితే ఈ వైరస్ మహమ్మారి మరింత పెరగడంతో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని ప్రజలకు ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇక పెద్ద సంఖ్యలో విరాళాలు కూడా వస్తున్నాయి, తాజాగా ప్రధాని కూడా విరాళాలు ఇవ్వాలి అని పిలుపునిచ్చారు.
ఈ క్రమంలో రతన్ టాటా.. తన టాటా ట్రస్ట్ తరఫున రూ.500 కోట్లు ప్రకటించారు. టాటా సన్స్.. ఇంతకు రెండంతల విరాళాన్ని ప్రకటించారు. ఏకంగా.. టాటా సన్స్ తరఫున.. కరోనా మహమ్మారిపై సమరానికి రూ.1000 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. దీంతో మొత్తంగా టాటా గ్రూప్ కరోనాపై యుద్ధానికి రూ.1500 కోట్లు ప్రకటించినట్లైంది. నిజంగా పేదలకి సాయం చేయడంలో టాటా గ్రూప్ ఎప్పుడూ ముందు ఉంటుంది, మరోసారి వారి మంచి మనసు చాటుకున్నారు అంటున్నారు జనం.