ఏపీలో ఒకే రోజు ఒకే జిల్లాలో 14 కరోనా పాజిటివ్ కేసులు…

ఏపీలో ఒకే రోజు ఒకే జిల్లాలో 14 కరోనా పాజిటివ్ కేసులు...

0
87
Corona in AP

ఏపీలో కరోనా వైరస్ కొరలను చాచుతోంది… నిన్నటి వరకు ఒక్క పాజిటివ్ కేసులేని జిల్లాలో ఒకే సారి 14 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి…. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు… పశ్చిమ గోదావరి జిల్లాలో 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి…

ఈ 14 మంది ఇటీవలే హజరత్ నిజాముద్దీన్ లోని జమైతా ఇస్లామిక్ సభకు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు.. వీరు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎవరెవరిని కలిశారు… ఎక్కడెక్కడ తిరిగారు అన్న విషయాలపై ఆరా తీసుస్తున్నారు…

ఏలూరులో 8, భీమవరంలో 2 ఉండి 1 గుండుగొలను 1 నారాయణపురం 1 పెనుగొండ 1 చొప్పున కేసులు నమోదు అయ్యాయి… ఒకే సారి జిల్లాలో 14 కరోనా కేసులు నమోదు కావడంతో జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు…