మార్కెట్లో వస్తువులు ఇప్పుడు కరోనా ప్రభావంతో ఎక్కడా దొరకడం లేదు.. దొరికినా అవి కాస్త ఖరీదు ఎక్కువగానే ఉంటున్నాయి, చిల్లర కొట్టులోనే కాదు పెద్ద పెద్ద అపరాల దుకాణాల్లో కూడా ఇదే తీరు కనిపిస్తోంది.. ఈ సమయంలో ఓ వ్యక్తి రేపు డబ్బులు ఇస్తాను ఆ వస్తువు ఇవ్వు అని దుకాణదారుడ్ని అడిగాడు.
దానికి అతను ఆ వస్తువు అరువు ఇవ్వను, రేపు కాష్ ఇచ్చి తీసుకువెళ్లు అన్నాడు, దీంతో కోపంతో ఆ వ్యక్తి ఆ షాపు ఓనర్ పై దాడి చేశాడు, ఇదంతా అక్కడ సీసీటీవిలో రికార్డ్ అయింది, అలా దాడి చేస్తున్న వ్యక్తిని వెంటనే అక్కడ షాపులో ఉన్నవారు పనివారు ఆపారు.
వెంటనే పోలీసులని పిలిచి అతడ్ని అప్పగించారు, అయితే ఇది తొలిసారి కాదని చాలా చోట్ల ఇలాంటి రుబాబ్ చేశాడు అని తేలింది… కూరగాయల దుకాణం దగ్గర కూడా వివాదం పెట్టుకుని ఇక్కడకు వచ్చాడు అని విచారణలో తేలింది.. దీంతో అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.