కరోనా తో భారత్ కు టిక్ టాక్ కంపెనీ భారీ సాయం

కరోనా తో భారత్ కు టిక్ టాక్ కంపెనీ భారీ సాయం

0
78

కరోనా వైరస్ మహమ్మారి అతి దారుణంగా విజృంభిస్తోంది, ఈ సమయంలో మన దేశంలో కూడా కోవీడ్ కేసులు మరిన్ని పెరుగుతున్నాయి, ఈ సమయంలో పెద్దలు వ్యాపారులు బిజినెస్ టైకూన్స్ సినిమా పరిశ్రమకు చెందిన వారు పలు మల్టీనేషనల్ కంపెనీలు అనేక సాయాలు చేస్తున్నాయి, కొందరు విరాళాలు ఇస్తుంటే మరికొందరు మెడికల్ సూట్స్ మాస్కులు కూడా అందిస్తున్నారు, పలువురు వెంటిలేటర్లు కూడా సాయం చేస్తున్నారు.

తాజాగా చైనాకు చెందిన సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ కూడా తన వంతు సాయంగా భారీ విరాళాన్ని ప్రకటించింది. దాదాపు రూ. 100 కోట్లతో నాలుగు లక్షల సేఫ్టీ సూట్లను మనదేశానికి అందించనున్నట్లు టిక్టాక్ వెల్లడించింది.

భారత్కు సేఫ్టీ సూట్స్ అందించాలని నిర్ణయించిందని టిక్టాక్ ఇండియా చీఫ్ నిఖిల్ గాంధీ తెలిపారు.
ముందు 20 వేల సూట్స్ భారత్ కు పంపనున్నారు, తర్వాత 1,80,375 సూట్లను పింపిస్తామంటూ టిక్టాక్ యాజమాన్యం తెలిపింది.