ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత లోకేశ్ ఫైర్ అయ్యారు… రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోనిది కాదని మానసిక పరిస్థితి అని ఎద్దేవా చేశారు… జగన్ బీద అరుపులు విచిత్రంగా ఉన్నాయని అన్నారు రాష్ట్రంలో లాక్ డౌన్ విధించిన వారం రోజులకే ఆర్థిక పరిస్థితి బాలేదు అంటూ హ్యాండ్స్ అప్ అన్నారు…
కరోనా ఎఫెక్ట్ తో కష్టాల్లో కూరుకుపోయిన పేద వాళ్లకు 5 వేల ఆర్థిక సహాయం అందించడానికి మనస్సు ఒప్పడం లేదని అన్నారు. పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక,రవాణా సౌకర్యం లేక కన్నీరు పెడుతున్న రైతన్నని ఆదుకోవడం లేదని ఎద్దేవా చేశారు లోకేశ్…
ఉపాధి లేక, మూడు నెలల వేతన బకాయిలు విడుదల కాక ఉపాధి హామీ వేతనదారులు ఇబ్బందులు పడుతుంటే జగన్ మోహన్ రెడ్డి గుండె చలించలేదని ఎద్దేవా చేశారు. కానీ ఉపాధి హామీ పథకంలో పనులు చేసిన వైసీపీ కార్యకర్తలకు 961 కోట్లు బిల్లులు విడుదల చేసారని లోకేశ్ మండిపడ్డారు