మనసు మార్చుకున్న టీడీపీ మాజీ మంత్రి

మనసు మార్చుకున్న టీడీపీ మాజీ మంత్రి

0
92

రాజకీయాల్లో గెలుపు ఓటమిలు సహజం. ఓడినా….. గెలిచినా రాజకీయ నేతలు మాత్రం కార్యకర్తలకు, అభిమానులకు నిత్యం టచ్ లోనే ఉండాలి… లేదంటే తమకు తాము నష్టం చేకుర్చుకోవడమే కాకుండా పార్టీ క్యాడర్ కూడా చేజారి పోయే అవకాశం ఉంది…

అయితే ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో చోటు చేసుకుంది.. ఎన్నికల సమయంలో వ్యతిరేకత ప్రభావంతో తిరువూర్ నుంచి జవహర్ కొవ్వూరు నుంచి వంగలపూడి అనిత పోటీ చేసి ఓటమి చెందారు…

ఓటమి చెందిన తర్వాత అనిత కొవ్వూరులో ఒకటి రెండుసార్లు పర్యటించారు… పూర్తి స్థాయిలో ఆమె తన సొంత నియోజకవర్గంపై దృష్టి పెట్టారు… దీంతోమాజీ మంత్రి జవహర్ కొవ్వూరుపై దృష్టి పెట్టారు… తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటినుంచి 9 సార్లు కొవ్వూరులో ఎన్నికలు జరుగగా సుమారు ఆరు సార్లు టీడీపీ జెండానే ఎగిరింది ఇక్కడ… అందుకే కొవ్వూరు టీడీపీ కంచుకోట అని అంటారు.. అందుకే తన సొంత నియోజకవర్గానికి రావాలని జవహర్ ప్రయత్నాలు చేస్తున్నారట…