కరోనా వైరస్ చాలా వేగంగా సోకుతోంది.. కేవలం అమెరికాలో పది కేసుల నుంచి నేడు రెండులక్షల కేసులు నెల రోజుల్లో నమోదు అయ్యాయి అంటే అది ఎంత వేగంగా పాకుతుందో తెలుసుకోవచ్చు, అయితే ఇప్పుడు మరణాలు కూడా అలాగే నమోదు అవుతున్నాయి.
ఇక కరోనా సోకి మరణించేవారి అంత్యక్రియలు వేరుగా ఉంటాయి, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి,
దీనిపై కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది.
ఆ వ్యక్తికి శవ పరీక్షలు నిర్వహించకూడదు, మాస్క్ గ్లౌజ్ వేసుకుని సిబ్బంది డాక్టర్లు ఉండాలి.. డెడ్ బాడీని ప్రత్యేకంగా తయారు చేసిన ప్లాస్టిక్ బ్యాగు లో ఉంచాలి. బ్యాగ్ వెలుపలి భాగాన్ని ఒక శాతం హైపో క్లోరైట్ తో శుభ్రం చేయాలి. డెడ్ బాడీని తరలించే వాహనాన్ని ఒక శాతం సోడియం హైపో క్లోరైట్ ద్రావణంతో శుభ్రం చేయాలి. ఇక ఈ డెడ్ బాడీ బ్యాగ్ ముఖం వరకూ తెరచి ఉంచాలి , చివరి చూపు కుటుంబ సభ్యులకు చూసే అవకాశం ఇవ్వవచ్చు… కాని వారు తాకకూడదు, మృతదేహం ముట్టుకోకూడదు స్నానం చేయించకూడదు.మృతదేహాన్ని ఎంబామింగ్ కు అనుతించరాదు.