మ‌న దేశంలో అతి పెద్ద క‌రోనా ఆస్ప‌త్రి ఎక్క‌డ క‌ట్టారంటే

మ‌న దేశంలో అతి పెద్ద క‌రోనా ఆస్ప‌త్రి ఎక్క‌డ క‌ట్టారంటే

0
34

క‌రోనా వైర‌స్ ఇప్పుడు ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది…ఈ వైర‌స్ ఇప్ప‌టికే 10 ల‌క్ష‌ల మందికి సోకేసింది… సామాజిక దూరం పాటిస్తేనే ఈ వైర‌స్ ని నిరోధించ‌గలం అని చెబుతున్నాయి ప్ర‌భుత్వాలు, ఇక వైద్యులు కూడా ఇదే చెబుతున్నారు… ఇక పూర్తి స్ధాయిలో మ‌న‌కి వైద్య స‌దుపాయాలు లేవు అని చెబుతున్నారు.

ఇక చైనా ఈ స‌మ‌యంలో అతి పెద్ద క‌రోనా హ‌స్పిట‌ల్ నిర్మించిన సంగ‌తి తెలిసిందే.. అయితే మ‌న దేశంలో కూడా ఇలాంటి హ‌స్పిట‌ల్ క‌డ‌తారా అని పెద్ద ప్ర‌శ్న ఎదురైంది… కాని మ‌న దేశంలో ఉన్న వ‌న‌రుల‌తో పేషెంట్ల‌ని క్యూర్ చేయాలి అని చూస్తున్నారు.

తాజాగా రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ ముంబైలో 100 పడకలతో కూడిన పూర్తి స్తాయి కరోనా హాస్పిటల్ ను ఏర్పాటు చేసింది. ఈ హాస్పిటల్ లో కేవలం కరోనా వైరస్ కు సంబంధించిన చికిత్స మాత్రమే అందించనున్నారు. అలాగే కరోనా వైరస్ కు చికిత్స అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు ఈ హాస్పిటల్ లో చేసారు. ఇదే ఇప్పుడు పూర్దిస్దాయి క‌రోనా ఆస్ప‌త్రిగా పేరు తెచ్చుకుంది.