నాగార్జునను, చిరంజీవిని అభినందించిన మోదీ

నాగార్జునను, చిరంజీవిని అభినందించిన మోదీ

0
92

భారతదేశంలో ప్రవేశించిన కరోనా మహమ్మారిని అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు… ఈ వైరస్ ను అంతమొందించేందుకు దేశమంతా ఎప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించారు… అలాగే ఈ వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు… ఈ అవగాహనలో భాగంగా సినీ తారలు కూడా ముందుకు వచ్చారు…

అందరు ఇల్లకే పరిమితం కావాలంటూ సూచనలు చేస్తున్నారు ఈ క్రమంలో స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్, సాయి తేజ్ కలిసి కోటీ సంగీత సారధ్యంలో ఒక సాంగ్ ను రూపోందించారు… ఈ సాంగ్ లో సామాజిక దూరం పాటించాలని తెలిపారు దీనిపై ప్రధాని మోదీ మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్, సాయి తేజ్ లను అభినందించారు… ఈ మేరకు ట్వీట్ కూడా చేశారు…

చిరంజీవిగారికీ, నాగార్జునగారికీ, వరుణ్ తేజ్ కీ, సాయి ధరమ్ తేజ్ కీ మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు.
అందరం మన ఇళ్ళల్లోనే ఉందాం.
అందరం సామాజిక దూరం పాటిద్దాం.
కరోనా వైరస్ పై విజయం సాధిద్దాం అని అన్నారు…