సోషల్ మీడియాలో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది తెలియడం లేదు.. అతి జాగ్రత్తగా ఏ పోస్టు కచ్చితమా అనేది తెలుసుకుని నమ్మాల్సిన పరిస్దితి వచ్చేసింది. ప్రధాని నరేంద్రమోదీ ఏ పిలుపునిచ్చినా ప్రజలు దానిని ఫాలో అవుతారు, అంతేకాదు ఆయన ఏ పని చేయమన్నా అభిమానులు చేస్తారు
ఇప్పుడు కరోనా సమయంలో కూడా ఆయన లాక్ డౌన్ ప్రకటిస్తే 130 కోట్ల మంది ఆయన మాట విని పాటిస్తున్నాం.. ఇక జనతా కర్ఫ్యూ రోజు ప్రజలు ఎవరిని బయటకురావద్దు అని తెలిపారు ప్రధాని మోదీ. సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు మోదీ.
అలాగే ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు ఆర్పివేసి దీపాలు లేదా కొవ్వుత్తులు, ఫ్లాష్ లైట్లు లేదా టార్చ్ లైట్లు వెలిగించాలని విజ్ఞప్తి చేశారు. దేశ సమైక్యతను చాటిచెప్పేందుకు ఇలా పిలుపునిచ్చారు మోదీ.
తాజాగా ఈ నెల 12వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఐదు నిమిషాల పాటు ప్రజలంతా ఇంటి బాల్కనీల్లో నిలబడి ప్రధాని మోదీకి సెల్యూట్ చేయాలని కొందరు అభిమానులు పిలుపునిచ్చారు. అయితే దీనిపై మోదీ రియాక్ట్ అయ్యారు…తనను నిజంగా ప్రేమించేవారు ఉంటే ఒక పేద కుటుంబాన్ని దత్తత తీసుకోవాలని తెలిపారు.