కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది, నెమ్మదిగా అందరికి ఇది చాపకింద నీరులా పాకుతోంది, అయితే దీనికి కేవలం సామాజిక దూరం పాటించడం దూరంగా ఉండటం అలాగే బయటకు రాకపోవడమే మెడిసన్, అందుకే చాలా వరకూ అందరూ ఇంటి పట్టున ఉంటున్నారు.
ఇక సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రెటీల వరకూ ఇది సోకుతోంది, తాజాగా బాలీవుడ్ నిర్మాత కరీమ్ మొరానీ కూతుళ్లు షాజా మొరానీ, జోయా మొరానీలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. వారికి పాజిటీవ్ వచ్చింది అని నిర్మాత వారి తండ్రి కూడా క్లారిటీ వచ్చారు.
వీరిద్దరిలో ఒకరు ముంబైలోని నానావతి ఆసుపత్రిలోను… మరొకరు కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రిలోనూ చికిత్స పొందుతున్నారు. ఈ సమయంలో మరో బ్యాడ్ న్యూస్ ఏమిటి అంటే.. ఇద్దరు కూతుళ్లతో పాటు కరీమ్ మొరానీకి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. వెంటనే ఆయనని కూడా నానావతి ఆసుత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.. దీంతో బాలీవుడ్ షాక్ అయింది, వారి ఆరోగ్యం గురించి వైద్యులని అడిగీ బీ టౌన్ పెద్దలు తెలుసుకుంటున్నారు.