దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంది.. ఈ సమయంలో సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రెటీల వరకూ అందరూ ఇంటికి పరిమితం అయ్యారు, అయితే చాలా మంది సెలబ్రెటీలు తమకు ఉన్న టాలెంట్ కుకింగ్ ఇలా అన్నీ కూడా సోషల్ మీడియాలో రోజు అప్ డేట్ గాపెడుతున్నారు.
ఇక జాగ్రత్తలు కూడా చెబుతున్నారు, తాజాగా సోనమ్ కపూర్.. ఇంట్లో చాక్లెట్ కేక్‌ను తయారుచేశానని.. అయితే కేక్ తయారుచేసే సమయానికి తన ఇంట్లో చాక్లెట్స్ అయిపోయాయని కాకపోతే ఫార్చ్యూన్ గార్మెంట్ ఇండియా సంస్థ వారు తాను అడిగిన వెంటనే తనికి చాక్లెట్ పంపించారని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.
ఇక దీనిపై జబర్ధస్త్ యాంకర్ రష్మి స్పందించారు..ఫార్చ్యూన్ గార్మెంట్ ఇండియా.. మీరు ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ఆమె కేక్ బేకింగ్‌కు కావాల్సిన పదార్థాలను అందించడం అంత ముఖ్యమా? ఆమెకు చాక్లెట్‌ను అందించే క్రమంలో మీరు మీ ఉద్యోగుల జీవితాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారు అని ఆమె
కామెంట్ చేసింది. దీంతో నెటిజన్లు రష్మి చెప్పింది కరెక్ట్ అంటున్నారు, ఈ సమయంలో ఏవి ఉంటే వాటితోనే సమయం గడపాలి అని చెబుతున్నారు.