ఫేస్ బుక్ కొత్త ఫీచ‌ర్ మీరు త‌ప్ప‌క తెలుసుకోండి

ఫేస్ బుక్ కొత్త ఫీచ‌ర్ మీరు త‌ప్ప‌క తెలుసుకోండి

0
39

మ‌న చేతిలోకి స్మార్ట్ ఫోన్ వ‌చ్చిన త‌ర్వాత చాలా స‌మ‌యం ఫోన్లకే కేటాయిస్తున్నాం… వాట్సాఫ్ ఫేస్ బుక్ ఇలా అనేక ర‌కాల చాటింగ్ యాప్స్ తో బిజీగా మారాం.. ఇక ఫేస్ బుక్ లో నిత్యం అప్ డేట్స్ ఇస్తూనే ఉంటున్నాం.

కాని కొంద‌రు దీనికి మ‌రీ దారుణంగా వ్య‌స‌నం అవుతున్నారు ,ఈ స‌మ‌యంలో ఫేస్ బుక్ ఓ స‌రికొత్త అప్ డేట్ అలాగే ఫీచ‌ర్ తీసుకువ‌చ్చింది, ఈ ఫీచ‌ర్ చాలా బాగుంది అంటున్నారు అంద‌రూ. అది ఏమిటి అంటే క్వైట్ మోడ్ పేరుతో ఓ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.

అంటే మీరు ఫేస్ బుక్ లో గ‌డిపే స‌మ‌యం దీంతో త‌గ్గించుకోవ‌చ్చు మ‌రి అది ఎలా అంటే…ఒక‌వేళ మీరు ఓ నాలుగు గంట‌లు ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేయ‌కూడ‌దు అని అనుకున్నారు అంటే,. టైమ్ సెట్ చేసి క్వైట్ మోడ్‌ను ఆన్ చేస్తే చాలు, మీరు పెట్టిన టైం వ‌ర‌కూ అది ఓపెన్ అవ్వ‌దు, మీరు ఓపెన్ చేయాలి అని ప్ర‌య‌త్నించినా ఆ స‌మ‌యం వ‌ర‌కూ ఓపెన్ అవ్వ‌దు అని మెసేజ్ చూపిస్తుంది.