ఇండియా అంతటా మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని అన్నారు ప్రధాని మోదీ… తాజాగా ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ… ఇదే ఐఖ్యమత్యం మరో 19 రోజులు చాటాలని అన్నారు…
ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విలువనిస్తూ లాక్ డౌన్ పొడిగించారు మోదీ…పరిస్థితి తీవ్రత దృష్ట్య మే 3వరకు లాక్ డౌన్ పొడిగించామని అన్నారు… అప్పటివరకు ఇవే నియమనిబంధనలు వస్తాయని తెలిపారు…
ఏప్రెల్ 20 వరకు పరిస్థితి తీవ్రంగా ఉంటుందని అన్నారు… రెడ్ జోన్ హాట్ స్పాట్ లలో ఏప్రెల్ 20 తర్వాత ఆంక్షలు సడలిస్తామని అన్నారు.. ఆహారానికి నిత్యావసరాలకు ఎలాంటి కొరత ఉండదని అన్నారు… మే 3 తర్వాత కొన్ని నిభందనలు కొనసాగుతాయని అన్నారు…