లేనింటి అమ్మాయిని తెచ్చుకుంటే కాస్త అణుకువగా ఉంటుంది అని అనుకున్నారు, కాస్త అందంగా ఉన్న అమ్మాయిని లేనింటి అమ్మాయిని తమ స్తోమతకు కాస్త తక్కువగా ఉన్నా తెచ్చుకున్నారు, ఒక్క కొడుకు కావడంతో కొడుకుపై ప్రేమతో ఇంటిలోనే కాపురం పెట్టించారు.
అయితే కోడలు మాత్రం తన బుద్ది చూపించింది, దాదాపు ఏడువారాల నగలు అత్తగారికి బంగారం ఉండటం చూసింది, ఈ సమయంలో తన బంగారు నగలు అత్తగారి బీరువాలో పెడుతున్నా అని అందరికి చెప్పి పెట్టింది.
కాని ఉదయం చూసే సరికి ఆ బంగారు నగలు లేవు, వాటిని జాగ్రత్తగా ఆ కోడలు తల్లికి చేరవేసింది, అత్తగారి బీరువాలో కేవలం కోడలివి మాత్రమే నగలు మాయం అయ్యాయి అని గోల పెట్టింది, కొడుకు మామగారు అంతా వెతికినా దొరకలేదు, అంతేకాదు నా నగలు నచ్చి అత్తగారే పక్కన పెట్టారు అని నేరం మోపిందట,
దీంతో నీ 50 గ్రాముల నగలు దొంగతనం చేయాల్సిన పని ఏముందు అని అత్త రివర్స్ అయిందట, అప్పుడే అమ్మ అల్లం పెళ్లం బెల్లం అయిందా అని వెంటనే వేరే కాపురం పెట్టిస్తా మీ చేత అని అత్త చెప్పిందట, కరోనా వివాదం చల్లారేక వారు కిరాయికి ఇచ్చిన ఇంటికి ఖాళీ చేయించి అందులో కాపురం పెట్టిస్తాం అని చెప్పారట తండ్రి తల్లి, మరి గొప్ప కోడలే.