ఇక మే 3 వరకూ మన దేశంలో లాక్ డౌన్ కొనసాగనుంది, ఈ సమయంలో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు వలస కూలీలు కూడా సతమతం అవుతున్నారు, ఈ సమయంలో వారికి కాస్త రిలీఫ్ ఇచ్చేలా పనులు చేసుకోవచ్చు అని కేంద్రం తెలిపింది, అయితే స్ధానికంగానే పనులు చేసుకోవాలి ఎక్కడకు వెళ్లకూడదు అని తెలిపారు.
మరి కేంద్రం కొన్నింటికి సడలింపు ఇచ్చింది అవి ఏమిటో చూద్దాం. ఇవి కేసులు తక్కువగా ఉన్న ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తాయి, ఈ సడలింపులుగ్రీన్ జోన్ లకి మాత్రమే అని తెలిపారు. ఏప్రిల్ 20 తర్వాత అమలులోకి వస్తాయి.
గ్రామీణ ప్రాంతాల్లో పనులు చేసుకోవచ్చు
వ్యవసాయ పనులు చేసుకోవచ్చు
స్దానికంగా కూలీ పనులు వ్యవసాయ పనులు చేసుకోవచ్చు
దూరం వెళ్లకూడదు, ప్రయాణాలు చేయకూడదు
ఏ రవాణా అంటే రైలు బస్సు విమానం దేశంలో ప్రజలను తీసుకువెళ్లదు
ఏప్రిల్ 20 నుంచి వ్యవసాయ ఉత్పతుల సేకరణ, మండీలకు అనుమతి
నిత్యవసరాల దుకాణాలు తెరచుకోవచ్చు.
ఆన్ లైన్ షాపింగ్, ఈ కామర్స్ అనుమతిచ్చిన కేంద్రం
రోడ్డుపైకి వస్తే ఫేస్ మాస్క్ లు తప్పనిసరి
ఉమ్మివేస్తే ఫైన్
పాలు కూరలు అమ్ముకోవచ్చు.
పది అంతకన్నా ఎక్కువ మంది ఒక చోట గుమి కూడడంపై నిషేదం
లిఫ్ట్ లో ఇద్దరు కంటే ఎక్కువ మంది ఎక్కొద్దని సూచన
లిక్కర్, గుట్కా, పొగాకు అమ్మకాలపై కొనసాగుతున్న నిషేదం
మత ప్రార్ధనలు, దైవ కార్యక్రమాలు నిషేదం
సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, జిమ్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ బంద్
స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్ టైన్ మెంట్ పార్కులు బంద్
అంత్యక్రియలకు హాజరయ్యేందుకు 20 మంది వరకు అనుమతి