కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తున్న నేపథ్యంలో మార్చి 23 నుంచి ఏప్రిల్ 14 వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు… దీంతో ఎక్కడి వారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది… అయితే నిన్న 21 రోజు పూర్తి అవ్వడంతో లాక్ డౌన్ ఎత్తి వేస్తారని కొందరు భావించారు…
కానీ దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు ఎక్కువ అవ్వడంతో లాక్ డౌన్ ను మే 3వరకు పొడిగిస్తున్నామని ప్రధాని మోదీ నిన్న తెలిపారు.. దీంతో మనస్థాపానికి చెందిన ఆలయ పూజారి కిచెన్ లో ఉన్న ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు… ఈ సంఘటన ముంబైలో జరిగింది… కర్ణాటకకు చెందిన కృష్ణ ముంబైలో దుర్గామాత టెంపుల్ లో పూజారిగా పని చేస్తున్నారు…
లాక్ డౌన్ తో ముంబైలో ఉన్న తన ఇంటికే పరిమితం అయ్యాడు… తాజాగా లాక్ డౌన్ ముగుస్తుందని తన ప్రాంతానికి వెళ్లెందుకు సిద్దమయ్యాడు కృష్ణ… అయితే తాజా పరిస్థితి నేపథ్యంలో లాక్ డౌన్ పొడిగించారు… దీంతో తన సొంత ఇంటికి వెళ్లే మార్గం కనిపించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కృష్ణ ఆత్మ హత్య చేసుకున్నాడు.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…