ఫలించిన విజయసాయిరెడ్డి మంత్రం.. ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ టచ్ లో

ఫలించిన విజయసాయిరెడ్డి మంత్రం.. ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ టచ్ లో

0
79

మహా విశాఖ నగర పాలక సంస్థకు దాదాపు13 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఎన్నికలు జరుగబోతున్నాయి… దీంతో గెలుపే లక్ష్యంగా చేసుకుని ఇరు పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు… రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఘన విజయం సాధించింది అయితే విశాఖలో మాత్రం నాలుగు స్థానాలను గెలుచుకుంది టీడీపీ.. అందుకే టీడీపీ పార్టీ నేతలు కూడా పోటీకి ఉత్సాహం చూపుతున్నారు…

ఈ ఎన్నికలను ఇరు పార్టీ నేతలు ప్రతిష్టాత్మంగా తీసుకున్నారు… వైసీపీ తరపున ఉత్తరాంధ్రకు వ్యవహారాల ఇన్ చార్జ్ గా ఉన్న విజయసాయిరెడ్డి తనదైన శైలి మంత్రంతో ముందుకు వెళ్తున్నారు… గతంలో ఎన్నడు లేని విధంగా ఉత్తరాంధ్రలో మెజార్టీ స్థానాలు వచ్చేలా కష్టపడ్డారు.. ఇప్పుడు మహా విశాఖ సంస్థల ఎన్నికల్లో కూడా గెలుపే లక్ష్యంగా విజయసాయిరెడ్డి మంత్రం వేస్తున్నారు…

ఈ మంత్రాంగంలో భాగంగానే టీడీపీ మాజీ ఎమ్మెల్యే రెహమాన్ వైసీపీ గూటికి చేరారు… అలాగే జనసేన టీడీపీకి చెందిన పలువురు నేతలను వైసీపీలో చుర్చుకున్నారు… అంతేకాదు టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వైసీపీకి టచ్ లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి… వారు కూడా మంచి ముహూర్తం చూసుకుని విజయసాయిరెడ్డి ఆద్వర్యంలో జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి…