వారంలో పెళ్లి వ‌రుడి బాగోతం తెలిసి షాకైన పెళ్లి కూతురు

వారంలో పెళ్లి వ‌రుడి బాగోతం తెలిసి షాకైన పెళ్లి కూతురు

0
101

ఓ వైపు క‌రోనా ఫీవ‌ర్ తో అంద‌రూ ఇంటి ప‌ట్టునే ఉంటున్నారు… అయితే ముందు పెట్టిన ముహూర్తాల‌కి చాలా మంది ఇంట్లో అతి త‌క్కువ మందితో 20 మంది లేదా 50 మందితో సింపుల్ గా పెళ్లి కానిచ్చేస్తున్నారు, మ‌ళ్లీ ఆరు నెల‌లు ఆగ‌డం ఎందుకు అని, అనుకున్న ముహూర్తానికి వివాహాలు కానిచ్చేస్తున్నారు.

అయితే ఇక వారంలో మ‌ర‌ద‌లితో పెళ్లి ఇంటి ద‌గ్గ‌రే పందిరి వేసి ఇంటి బంధువులు చుట్టుప‌క్క‌ల ఓ 50మందితో వివాహం కానిచ్చేద్దాం అని అనుకున్నా‌రు, అయితే అనూహ్యంగా ఓ సీన్ పెళ్లి కూతురు చూసింది, పెళ్లి కొడుకు ఓ అమ్మాయితో వీడియో కాల్ మాట్లా‌డాడు , ఐల‌వ్ యూ నిన్ను వ‌ద‌ల‌ను నేను అని అన్నాడు.

ఇవ‌న్నీ ఆ మ‌ర‌ద‌లు వింది, ఆమె రావ‌డం చూసి కాల్ క‌ట్ చేశాడు, ఇక ఎవరు ఆ అమ్మాయి మ‌రి న‌న్ను ఎందుకు పెళ్లి చేసు‌కుంటున్నావు అంటే అత‌ను ఏమీ మాట్లాడ‌లేదు, దీంతో నిజం చెప్ప‌క‌పోతే చ‌నిపోతా అని అంది, వెంట‌నే అత‌ను ప్రేయ‌సి గురించి నిజంచెప్పాడు, వెంట‌నే ఆమె ఈ పెళ్లి చేసుకోను అని తెగేసి చెప్పింది, ఇక అబ్బాయి ప‌ద్ద‌తి చూసి అమ్మాయి తండ్రి మేన‌మామ కూడా ఈ పెళ్లి వ‌ద్దు అని, నా కూతురికి వేరే పెళ్లి చేస్తా అని తేల్చాడు.