ఫ్లాష్ న్యూస్ – తెలంగాణ‌ స‌ర్కార్ మ‌రో కీల‌క నిర్ణ‌యం

ఫ్లాష్ న్యూస్ - తెలంగాణ‌ స‌ర్కార్ మ‌రో కీల‌క నిర్ణ‌యం

0
83

తెలంగాణ‌లో క‌రోనాపై పోరాటం జ‌రుగుతూనే ఉంది.. కేసులు సంఖ్య తీవ్రంగా పెరుగుతోంది, దీంతో స‌ర్కార్ లాక్ డౌన్ మ‌రింత క‌ఠినంగా అమ‌లు చేస్తోంది, ఎవ‌రిని బ‌య‌ట‌కు రానివ్వ‌డం లేదు, అయితే సూర్యాపేట‌లో కూడా కేసుల సంఖ్య పెర‌గ‌డం క‌ల‌వ‌రం రేపింది.

ఈ క‌రోనా వైర‌స్ సోకిన వారి నుంచి కుటుంబంలో లేదా స‌న్నిహితంగా ఉన్న వారికి వెంట‌నే సోకుతోంది, అందుకే సామాజిక దూరం పాటించాలి, అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ 14 రోజుల్లో ల‌క్ష‌ణాలు క‌నిపించేవి వైర‌స్ సోకితే, కాని తాజాగా ఈ లెక్క మారుతోంద‌ట‌.

అందుకే తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హోం క్వారంటైన్‌ గడువును 14 నుంచి 28 రోజులకు పెంచింది. కేవలం ప్రైమరీ కాంటాక్టులకే కరోనా పరీక్షలు చేయాలని అధికారులకు సూచించింది. అయితే కొందరికి ప‌రీక్ష‌లు చేయ‌గా, 14 రోజులు కాదే ఏకంగా 20 లేదా 18 రోజుల‌కి ల‌క్ష‌ణాలు క‌నిపించాయి అని తెలుస్తోంది, అందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌.