ఏపీలో ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీల మధ్య మరోసారి స్నేహం చిగురించే అవకాశాలు ఉన్నాయా అంటే అవుననే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… కొద్ది కాలంగా రెండు పార్టీల నేతల మధ్య పాజిటివ్ వాతావరణం ఏర్పడుతోందని చర్చించుకుంటున్నారు…
ఇటీవలే ప్రధాని మోదీ చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేసిన తర్వాతే ఈ పరిస్థితి ఏర్పడిందని చర్చించుకుంటున్నారు.. గతంలో కంటే ఇప్పుడు టీడీపీ బీజేపీ నాయకులు పాజిటివ్ గా వ్యవహరిస్తున్నారట… ఇది భవిష్యత్ లో మైత్రీకి దారి తీసే అవకాశం ఉందని అంటున్నారు… కరోనా సమయంలో మోదీ చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేశారు…
ఫోన్ చేసిన సమయంలో వీరిద్దరి మధ్య ఎటువంటి రాజకీయ ప్రస్తావన రాలేదు… కేవలం కరోనా గురించే ముచ్చటించుకున్నారు.. అయినా కూడా టీడీపీకి ఈ పరినామం జోష్ నింపుతోందట… అంతేకాదు బీజేపీ నేతల్లోను సిగ్నల్ లు పాజిటివ్ గానే వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి