లాక్ డౌన్ వేళ ఎక్కడి వాళ్లు అక్కడ ఉండిపోయారు, ముఖ్యంగా మన దేశంలో ప్రయాణాలు కూడా లేవు రవాణా పూర్తిగా స్ధంభించిపోయింది. ఉపాధి లేక అందరూ బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. తినడానికి కొందరికి తిండి లేదు, రాష్ట్రాలు కేంద్రం సాయం అందిస్తే వారు రేషన్ తెచ్చుకుంటున్నారు, అందరికి అన్నం పెట్టే రైతన్న నేడు పంటలు పండిస్తూ తన కష్టం తాను చేస్తున్నాడు.
అయితే మన దేశంలో ఆహర నిల్వలకు కొరత లేదు… కాని కొన్ని చోట్ల మాత్రం నగదు ఉన్నా ఆహరం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక మన దేశంలో కూడా కొందరు రైతులు పంట పండిస్తున్నారు కాని.. దానిని మార్కెట్ చేయడానికి అమ్మడానికి సరైన సదుపాయాలు లేక లాక్ డౌన్ వేళ నష్టపోతున్నారు.
ఈ సమయంలో వారికి కాస్త ఊరటనిచ్చింది యూపీ సర్కార్.వారణాసిలో కూరగాయలు సాగుచేసే రైతులకు కొంత ఊరట లభించింది. కాశీ నుంచి బ్రిటన్‌కు నాలుగు టన్నుల కూరగాయల ఎగుమతి అవుతున్నాయి. ఈ మేరకు పచ్చిమిర్చి, దోసకాయ, పొట్లకాయ, ఆనక్కాయ తదితర కూరగాయలను ఇప్పటికే ఎయిర్ కండిషన్డ్ కంటైనర్ల ద్వారా ఢిల్లీకి పంపించారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఎయిర్ కార్గో ద్వారా లండన్‌కు చేరుకుంటాయట, దీంతో తమ పెట్టుబడి తమకు వస్తుంది అని ఆరైతులు ఆనందంగా ఉన్నారు.