కర్నూల్ జిల్లా త్వరలో న్యాయ రాజధాని కాబోతుంది… ఒకప్పుడు కర్నూల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా ఉంది… అలాంటి కర్నూల్ జిల్లా కరోనా వైరస్ దేశంలోనే ముందుంది… దేశంలో అన్ని జిల్లాలతో పోల్చి నప్పుడు కర్నూల్ జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి… ఈ పరిస్థితిలో కర్నూల్ జిల్లా యంత్రాంగం రేయింబవళ్లు కరోనా నియంత్రణకు కృషి చేస్తున్నాయి..
ప్రభుత్వం కూడా కర్నూల్ లో ప్రత్యేక కోవిడ్ ఆసుపత్రికి ఏర్పాటు చేసింది…అయితే కరోనా కంటే రాజకీయ వైరస్ జిల్లాలో ఎక్కువగా పీడిస్తోంది… జిల్లా నేతలు వైరస్ కంటే రాజకీయాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు… ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పై మాజీ మంత్రి అఖిల ప్రియ సంచలన ఆరోపణలు చేశారు… హఫీజ్ ఖాన్ వల్లే జిల్లాలో కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయని ఆరోపించారు…
ఆయన పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు… దీనిపై హఫీజ్ ఖాన్ ఘాటుగా స్పందించారు… తాను వైరస్ వ్యాప్తికి కారణం అని నిరూపిస్తే కర్నూల్ సెంటర్ లో ఉరి వేసుకుంటానని సవాల్ విసిరారు…ఇలా జిల్లాలో వైసీపీ వర్సెస్ టీడీపీ నేతలమధ్య మాటల యుద్దం కొనసాగుతోంది… కరోనాను కలిసికట్టుగా కట్టడి చేయాల్సిన రాజకీయ పార్టీలు ఈ సమయంలో రాజకీయాలకే ప్రధాన్యత ఇవ్వడం విమర్శలుకు తావిస్తోంది….