చంద్రబాబు ఆశ అదే…

చంద్రబాబు ఆశ అదే...

0
124

డ్వాక్రా మహిళలకు ముఖ్యమంత్రి జగన్ మెహన్ రెడ్డి సున్నా వడ్డీ నిధులు1400 కోట్లు విడుదల చేశారని అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి . అలాగే విద్యా దీవెన కింద 4 వేల కోట్లు ఇచ్చారని తెలిపారు… అయితే ఇందులో మాజీ ముఖ్యమంత్రి బాబు హయాంలోని బకాయిలూ ఉన్నాయి. ప్రజలు ఎంత నిశ్చింతగా ఉన్నారో చూపించే దమ్ము ఎల్లో మీడియాకు లేదు. కుల పెద్ద ఏదో లేఖ అని వదిలితే రోజంతా అదే చెత్త చూపించారని ఆరోపించారు.. ఈమేరకు వరుస ట్వీట్లు కూడా చేశారు…

కరోనా వైరస్ అంటే దోమలపై యుద్ధం, ఎలుకలు పట్టడం లాంటిది కాదు చంద్రబాబూ. దోమలను నియంత్రించావా? వైరస్సూ అంతే. సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నవాడివి నీకేం తెలుసని జగన్ గారిపై విషం చిమ్ముతున్నావు? ప్రజల గురించి మొసలి కన్నీళ్లు కార్చవద్దు. కరోనా కట్టడిలో రాష్ట్రమే ముందు నిలుస్తుంది.

వ్యాక్సిన్ వచ్చేదాక కరోనాతో సహజీనం తప్పదని జగన్ మోహన్ రెడ్డి చెప్పింది 100 శాతం కరెక్టు. వైరస్ నిర్మూలనకు నేరుగా పనిచేసే మందులేవీ ఉండవు. వ్యాధి లక్షణాలను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. ప్లాస్మా థెరపీ ఆశలు రేకిత్తిస్తోంది. కేంద్రం కూడా దీనికి అనుమతించింది.

అంతా తనకే తెలుసనే భ్రాంతి నుంచి చంద్రబాబు బయటపడలేడు. అనామకుడిగా మిగిలిపోయి, ఎవరూ పట్టించుకోకపోయేటప్పటికి గింజుకుంటున్నాడు పాపం. బహిరంగ లేఖట! ఈయన లేఖను నమ్మి ప్రజలంతా వీధుల్లోకి వచ్చి మాకు బాబే కావాలి అని రెచ్చిపోవాలనేది ఆయన ఆశ. కుల మీడియా భజన తప్ప ఎక్కడా చప్పుళ్లు లేవని అన్నారు…