నారాలోకేశ్ కు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

నారాలోకేశ్ కు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

0
86

ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు… ఇటీవలే టీడీపీ నేత లోకేశ్ ట్విట్టర్ వేదికగా చేసుకుని ఆప‌ద‌మొక్కులవాడా! అనాథ‌ర‌క్ష‌కా! నీకూ పేదా పెద్ద తేడాల్లేవంటారు. వైర‌స్ వ్యాప్తి చెందుతున్న ఈ కాలంలో సామాన్యుల‌కు నీ ద‌ర్శ‌న‌భాగ్య‌మే లేదు. వైఎస్ తోడల్లుడు స‌కుటుంబ స‌మేతంగా వ‌చ్చేస‌రికి నీ గుడి త‌లుపులు ఎలా తెరిచార‌య్యా అని ట్వీట్ చేశారు…

దేవ‌దేవుడు ఉత్స‌వాల‌తో అల‌రారిన తిరుమ‌ల‌గిరులు నిర్మానుష్యంగా మారిన‌వేళ‌ నిబంధ‌న‌లు తుంగ‌లోతొక్కి నీ స‌న్నిధిలో పుట్టిన‌రోజు వేడుక‌లు జ‌రుపుకోవ‌డం అప‌రాధం కాదా! ఏడుకొండ‌లే లేవ‌న్నోళ్లు.. నువ్వున్నావంటే న‌మ్ముతారా? నీ కొండ‌ను నువ్వే కాపాడుకో స్వామీ అని ట్వీట్ చేశారు లోకేశ్ దీనికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు…

ప్రతీ శుక్రవారం శ్రీవారికి జరిగే అభిషేకానికి రెండు వారాలకు ఒక సారి టీటీడీ చైర్మన్ హాజరు కావడం ఆనవాయితీ… తాను కూడా అలానే వెళ్లాను… తన తల్లి దండ్రులు తన సతీమని ఎవ్వరు లేరు… ఫోటోలో ఉన్నది అందరు టీటీడీ ఉద్యోగులే… మీ ట్వీట్ అపద్దం కొంచెమైనా పాపవిభీతి ఉండాలి తప్పుతెలుసుకో…