చాలా మంది బంధాలకి విలువ ఇవ్వడం లేదు.. కొందరు ప్రవర్తించే తీరు సమాజంలో చాలా నీచాతి నీచంగా ఉంటోంది. ఏకంగా వరుసకు తమ్ముడు అయ్యే వ్యక్తిని ఆమె ప్రేమించింది, అది కూడా ఆమెకి పెళ్లి అయిన మూడు సంవత్సరాల తర్వాత, దీంతో భర్త ఇలాంటి ఆలోచన మానుకో అని చెప్పాడు, కాని వీరిద్దరూ సరసాలలో మునిగిపోతున్నారు.
చివరకు భర్త తమని ప్రశ్నించడంతో భర్తనే చంపాలి అని పన్నాగం వేసింది, పొలం నుంచి ఇంటికి వచ్చిన భర్తకి భోజనంలో విషం పెట్టింది, అయితే అతనికి పచ్చడి అన్నం తేడా అనిపించడంతో అతను మధ్యలోనే మానేశాడు.
ఆయన తమ్ముడి ద్వారా ఆస్పత్రికి వెళ్లి గుండెల్లో మంటగా ఉంది అని చూపించుకుంటే విషప్రయోగం అయిందని తెలిపారు డాక్టర్లు, దీంతో ఆమెపై వరుసకు తమ్ముడు అయ్యే వ్యక్తిపై కేసు పెట్టాడు పోలీస్ స్టేషన్ లో, జలంథర్ లో ఈ దారుణం జరిగింది.