జైలునుంచి 17 వేల మంది బయటకు…

జైలునుంచి 17 వేల మంది బయటకు...

0
78

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ నృత్యం చేస్తోంది… ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది.. ప్రతీ రోజు అత్యధికంగాకరోనా కేసులు ఈ రాష్ట్రం నుంచే ఎక్కువగా వస్తున్నాయి..

రోజు వెయ్యి కేసులు తగ్గడంలేదు… ఈ మాయదారి మహమ్మారి అక్కడి వైద్యులను పోలీసుల సిబ్బందిని కూడా వదలకుంది.. అంతేకాదు ఇటీవలే జైల్లో ఉన్న ఖైదీలకు కూడా కరోనా సోకింది… దీంతో మహారాష్ట్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది…

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జైళ్ల నుంచి 17 వేల మంది ఖైదీలను తాత్కాలిక పెరోల్ మీద బయటకు పంపాలని నిర్ణయించింది… త్వరలోనే వారిని జైలునుంచి విడుదల చేయనుంది.. ముంబై ఆర్థర్ రోడ్డు పక్కన ఉన్న సెంట్రల్ జైలులో 150 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది…