సీన్ రివర్స్ ఏపీ బీజేపీకి డ్యామెజ్

సీన్ రివర్స్ ఏపీ బీజేపీకి డ్యామెజ్

0
110

ఏపీ బీజేపీ పార్టీ గురించి ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది… బీజేపీ కేవలం విమర్శలకే పరిమితం అవుతుందని రాష్ట్ర ప్రజల పక్షానా ఒక్కరు కూడా నిలబడకున్నారని అంటున్నారు… ప్రతిపక్ష పార్టీగా సర్కార్ వైఫల్యాలను ఎత్తి చూపాలి అదే సమయంలో ఒక జాతీయ పార్టీగా ఈ రాష్ట్రం గురించి ఇంకా బాధ్యత లేదా అనే విమర్శలు వస్తున్నాయి.. కేవలం విమర్శలు ఆరోపణలకు మాత్రమే పరిమితం అయితే ఏలా అని కొంత మంది ప్రశ్న…

ఏపీ బీజేపీలో బాడా నేతలు ఉన్నారు.. వీరికి తోడు టీడీపీ ప్రతిపక్షానికి చేరడంతో సుజనా, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, ఆదినారాయణ రెడ్డి వంటి కీలక నేతల బీజేపీ తీర్ధం తీసుకున్నారు… టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నానా హడావుడి చేసిన వీరు బీజేపీలో చేరేముందు తాము రాష్ట్ర ప్రయోజనాలకోసమే పార్టీ మారామని చెప్పారు… అయితే ఇప్పుడు ఇదే రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంటే పట్టించుకోవడం లేదని అంటున్నారు…

కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది… ఈ సమయంలో కేంద్రానికి లేఖలు రాయడమో, లేక ఫోన్ చేసి రాష్ట్రానికి వీలైనంత సహాయం చేయాలి… కానీసం వారి వారి జిల్లాలకు అయినా తమ వంతు సాయం చేయేచ్చు చేయించుకోవచ్చు… అది కూడా చేయకున్నారు… ఎంపీలుగా ఉన్న వీరు కేంద్రంలో సత్తా ఉందా లేదా ఒక వేళ ఉంటే ఇప్పటికైనా స్పందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు… చూడాలి మరి బీజేపీ నేతలు స్పందిస్తారో లేదో.