అండర్ వరల్డ్ డాన్ క‌న్నుమూత -అనుష్క కుటుంబానికి ఏమ‌వుతాడంటే

అండర్ వరల్డ్ డాన్ క‌న్నుమూత -అనుష్క కుటుంబానికి ఏమ‌వుతాడంటే

0
128

డాన్ అనే ప‌దం వింటే మ‌న‌కు ముంబైలో గ‌తంలో ఉండే డాన్స్ గుర్తువ‌స్తారు, ఇప్పుడు ముంబైలో అలాంటి వారికి పోలీ‌సులు చెక్ పెట్టారు, దావుద్ లాంటి వారు కూడా ఎక్క‌డ ఉన్నారో తెలియ‌ని ప‌రిస్దితి, అయితే బెంగ‌ళూరుకు చెందిన ఓ మాజీ డాన్ క‌న్నుమూశారు, దాదాపు 30ఏళ్లు సామ్రాజ్యం పెంచుకున్న డాన్ ఇప్పుడు క‌న్నుమూశాడు.

ఆయ‌నే మాజీ అండర్ వరల్డ్ డాన్ ముతప్ప రాయ్ . ఆయన వయసు ప్రస్తుతం 68 సంవత్సరాలు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బ్రెయిన్ క్యాన్సర్‌ కు చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు, గ‌తంలోనే త‌న‌కు ఈ క్యాన్స‌ర్ ఉంద‌ని ఐదేళ్ల కంటే బ‌త‌క‌ను అని తెలిపారు ఆయ‌న.. సాధార‌ణ బ్యాంకు ఉద్యోగిగా త‌న జీవితం ప్రారంభించి డాన్ అయ్యాడు.

ఇక 2000 లో ఆయ‌న దుబాయ్ లో ఉండ‌గా అక్క‌డ ప్ర‌భుత్వం భార‌త్ కి అప్ప‌గించింది… బెంగ‌ళూర్ లో డాన్ గా 30 ఏళ్లు త‌న రాజ్యం ఏలాడు, అయితే ఆయ‌న ఈ వ్య‌వ‌హారాలు మానేసి తర్వా‌త ప్ర‌జా సేవ చేశారు.కర్ణాటక అనే ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేసి దాని ద్వారా చాలామంది పేద ప్రజలకు సహాయం చేశారు. ఇక ఈయన అనుష్క శెట్టి ఫ్యామిలీకి చాలా దగ్గర బంధువు అని తెలుస్తోంది, . బాహుబాలి రిలీజ్ తరువాత అనుష్క దేశ వ్యాప్తంగా ఆలయాల సందర్శనకు వెళ్లగా ఈయన కూడా అనుష్క వెంట ఉన్నారు.