దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా వలస కూలీల నడక చిత్రాలు కనిపిస్తున్నాయి, వారి బాధ వర్ణణాతీతం, దేశంలో శ్రామిక్ రైళ్లు ఏర్పాటు చేసినా చాలా మంది కూలీలు ఇంకా కాలిబాటన వెళుతున్నారు, వారి బాధ చెప్పలేనిది, అలా రోడ్లపై వెళుతున్న వారికి ఎందరో సాయం చేస్తున్నారు, అంతేకాదు వారికి నీరు ఆహరం అందిస్తున్నారు.
కొందరు ట్రావెల్స్ ఏర్పాటు చేస్తున్నారు..తాజాగా వీరి బాధ చూసి చలించిపోయిన నటుడు
సోనూసూద్ వారికి సాయం చేస్తున్నారు. ముంబైకి ఉపాధి కోసం వచ్చిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కార్మికులను తరలించేందుకు ఆయన ముందుకు వచ్చారు. వారు ఎంత మంది ఉన్నారు, ఇప్పుడు ఎవరు వెళ్లాలనుకుంటున్నారో వారిని చూసి ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుని వారికి వాహనాలు ఏర్పాటు చేసి సొంత గ్రామాలకు పంపారు.
ముంబై నుంచి యూపీలోని లక్నో, హర్దోయ్, ప్రతాప్‌గఢ్, సిద్ధార్థ్ నగర్ ప్రాంతాలకు కూలీలను పంపారు.
ముంబై నుంచి బిహార్, జార్ఖండ్‌లకు కూడా వలస కూలీలను ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి పంపారు. ఈ సమయంలో వారికి ఆహరం నీరు అందించేందుకు ఏర్పాట్లు చేశారు, వారికి చేతి ఖర్చులకి నగదు ఇచ్చారు.